సినిమాలు ఎంపిక చేసుకునే విధానంలోనే సదరు హీరో యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా హీరోల కెరియర్ బాగా సాగాలంటే వారు ఎంపిక చేసుకునే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయితేనే ప్రేక్షకులు గుర్తుంచుకునే పరిస్థితి ఉన్న రోజులివి. ఈ నేపథ్యంలో వారానికో సినిమా ప్రేక్షకుల అభిప్రాయం మారుతున్న కొద్దీ కొంతకాలానికి వారికి ఉన్న అభిమానులు కూడా మారిపోతున్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు హీరోలకు భారీ కాంపిటీషన్ బాగానే ఉందని చెప్పవచ్చు.

అలా హీరో రవితేజ చాలా సంవత్సరాలుగా ఇతరులతో పోటీ పడుతునే ఉన్నాడు. ఆయన సినిమాల ఎంపికలో ఒకటి రెండుసార్లు పొరపాటు పడ్డావు కూడా ఫ్లాప్ లు వచ్చి వెనక్కి పోయిన ప్రతి సారి ఓ సూపర్ హిట్ సినిమాతో మళ్ళీ ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరొక రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిలాడి సినిమా త్వరలో విడుదల కాబోతు ఉండగా ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఇక త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రాబోయే సినిమా ఇటీవలే అనౌన్స్ అయ్యింది.

అయితే ఆ మధ్య రవితేజ పై ఓ దర్శకుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి మహా సముద్రం సినిమా కథను మొదట రవితేజకు వినిపించగా ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. అయితే తన కథ మీద ఎంతో మంచి నమ్మకం పెట్టుకున్న అజయ్ భూపతి రవితేజ పై కొన్ని విమర్శలు చేశాడు. అయితే అప్పుడు నోరుమెదపని రవితేజ కి ఇప్పుడు మద్దతు పెరిగిపోతుంది. ఇటీవలే మహా సముద్రం సినిమా విడుదలై ఫ్లాప్ కాగా అన్ని విమర్శలు చేసినా రవితేజ సైలెంట్ గా ఎందుకు ఉన్నాడు అనేది ఇప్పుడు అందరికీ అర్థం అయింది. సినిమాల ఎంపికలో తాను మళ్లీ మళ్లీ పొరపాట్లు చేయబోనని రవితేజ ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: