ఆయన ఓ వ్యాపార వేత్త.. విమానంలో ప్రయాణిస్తున్నాడు.. అనుకోకుండా అతని పక్క సీట్లో ఓ హీరోయిన్‌ వచ్చి కూర్చుంది. హీరోయిన్ అంటే సినిమా స్టార్ కాకపోయినా.. టీవీ సీరియళ్లలో బాగానే పేరు సంపాదించిన అందగత్తె ఆమె. మరి అంతటి అందగత్తె తన పక్కనే కూర్చుంటే తట్టుకోలేకపోయాడో ఏమో.. సదరు పారిశ్రామిక వేత్త.. ఓ అడుగు ముందుకు వేశాడు. ఆ ఏముందిలే సినిమా వాళ్లే కదా.. పెద్దగా బెట్టుచేయదేమో అనుకున్నాడో ఏమో.. మెల్లగా నడుంపై చేయి వేశాడు. అంతటితో ఆగకుండా.. తన మీదకు లాక్కున్నాడు.


అనుకోని ఈ పరిణామంతో ఆ హీరోయిన్ బిత్తరపోయింది. ఇదేం పని అంటూ గట్టిగా గదమాయించింది.. దాంతో మనోడు సర్దుకున్నాడు.. అబ్బే మీరు అమ్మాయి అని అనుకోలేదు.. ఎవరో అబ్బాయి అనుకున్నా అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. పురుషుడు అనుకొని అలా చేశాను సారీ సారీ అంటూ ఆ హీరోయిన్కు క్షమాపణలు తెలిపాడు. అప్పటికి ఆ షాక్‌ లో ఉండిపోయిన ఆ హీరోయిన్.. ఇంటికి వెళ్లాక పదే పదే ఆ ఘటన తలచకుని డిస్టర్బ్ అయ్యింది.


అతగాడిని అలా వదలకూడదని.. జరిగిన విషయాన్ని సదరు విమానయాన సంస్థకు వివరంగా రాసి కంప్లయింట్ మెయిల్‌ చేసింది. ఆ వ్యక్తి ఎవరో ఆ వివరాలు తనకు చెప్పాలని అడిగింది. అయితే.. తాము అలా చేయలేమని విమానయాన సంస్థ తెలిపింది. అయితే.. విషయాన్ని పోలీసులకు కంప్లయింట్ చేస్తే ఆలోచిస్తామని తెలిపింది.  దీంతో ఆ హీరోయిన్ అక్టోబర్‌ 4న ముంబయిలోని సహర్‌ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆ వ్యాపారవేత్తను పోలీసులు ఈనెల 14న అరెస్టు చేశారు.


ఘజియాబాద్ వ్యాపారిని బుధవారం కోర్టులో హాజరుపరుచారు. అతడికి కోర్టు ఒకరోజు కస్టడీ విధించింది. అయితే ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని వ్యాపారవేత్త కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆ హీరోయిన్ ఇప్పుడు చెబుతోంది. వాళ్లు తన అడ్రస్ తెలుసుకుని ఇంటి కూడా వచ్చారని.. తనపై ఒత్తిడి తెచ్చారని.. ఆమె అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: