శ్రీరామ్ మిలీనీయంలో యువ‌త మ‌దిని దోచిన ఓ క‌ల‌ల హీరో. కోలీవుడ్‌కు చెందిన వాడు అయినా తెలుగులో కూడా మంచి సినిమాలు చేశాడు. ఒక‌రికి ఒక‌రు లాంటి సూప‌ర్ హిట్ సినిమాతో మ‌న తెలుగు ప్రేక్ష‌కులకు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. అప్ప‌ట్లో శ్రీరామ్ - ఆర్తీ చాబ్రియా రొమాన్స్ యువ‌త‌కు పిచ్చెక్కిం చేసింది. సినిమాటోగ్రాఫ‌ర్ ర‌సూల్ ఎల్లోర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రీరామ్ .. మ‌ళ్లీ 20 ఏళ్ల త‌ర్వాత తెలంగాణ‌లో జ‌రిగిన య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన అస‌లేం జ‌రిగింది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.
సినిమా గురించి శ్రీరామ్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. ద‌ర్శ‌కుడు రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) క‌థ చెప్పేట‌ప్పుడే తాను క‌థ‌లో లీన‌మైపోయాన‌ని చెప్పాడు. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్టులు కూడా ఉంటాయ‌ని శ్రీరామ్ చెప్పారు. ఇక ఈ సినిమాకు తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నాన‌ని.. త‌న‌కు హైద‌రాబాదీ తెలుగు వ‌చ్చు అని.. ఈ సినిమా క‌థ అంతా తెలంగాణ ప‌ల్లెల్లో జ‌ర‌గ‌డంతో త‌న ప‌ని మ‌రింత సులువు అయ్యింద‌ని శ్రీరామ్ చెప్పారు.
ఇక చెన్నై నుంచి ఇక్క‌డ‌కు రావ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని అనుకున్నాన‌ని.. కానీ సింగిల్ టేక్‌ల‌లోనూ అన్ని షాట్‌లు ఓకే అవ్వ‌డంతో షూటింగ్ చాలా త్వ‌ర‌గా పూర్త‌య్యింద‌ని శ్రీరామ్ సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న‌పై న‌మ్మ‌కంతో మంచి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత జాన్స‌న్‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ఇక ఇక్క‌డ వాతావ‌ర‌ణం చూసిన త‌ర్వాత త‌న‌కు మ‌రిన్ని తెలుగు సినిమాలు చేయాల‌న్న కోరిక ఉంద‌ని.. మంచి అవ‌కాశాలు వ‌స్తే ఇక్క‌డ త‌ప్ప‌కుండా సినిమాలు చేస్తాన‌ని ఆయ‌న తెలిపారు. అలాగే అస‌లేం జ‌రిగింది సినిమా లో రొమాన్స్ , ప్రేమ‌, ఫిక్ష‌న్ తో పాటు మంచి సాహిత్యం కూడా ఉంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: