మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో గొప్ప మనసున్న వ్యక్తి అని అందరికి తెలుసు. అయితే ఆయన అభిమానుల కంటే తన ప్రాణం ఎక్కువ కాదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం తన కుడి చేతికి సర్జరీ చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అర్ధరాత్రి వచ్చి అన్న సహాయం కావాలి అంటే నేనున్నాను అంటూ వచ్చే చిరుని, సినీ ఇండస్ట్రీలో పెద్ద అని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ రాజకీయాల్లో పెద్దగా ప్రజాదరణ పొందలేక పోయినప్పటికీ, సినీఇండస్ట్రీలో ప్రేక్షకాధరణ మాత్రం బాగా పొందుతున్నారు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమాని విషయంలో చేసిన ఒక పెద్ద పనికి ఇప్పుడు మెగా అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా చిరంజీవిని ప్రశంసిస్తున్నారు.. ఇక అసలు విషయానికి వస్తే , మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన విశాఖపట్నానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి గత కొంత కాలంగా అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు.. వెంకట్ తన వ్యాధిని నయం చేసుకోవడానికి సామాజిక మాధ్యమం అయినా ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని , వారితో మాట్లాడాలనే విషయాన్ని వెల్లడించాడు.. ఇక ట్విట్టర్లో నా ఆరోగ్యం అంతగా బాగా లేదు నేను మిమ్మల్ని చనిపోయే లోపు కలవాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా వెంకట్ అభ్యర్థించాడు..

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించి వెంకట యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకొని , తనను వెంటనే కలవాల్సిందిగా కోరాడు.. కానీ వెంకట్ అనారోగ్యకారణంగా కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకు వెళ్లారు.. కానీ ఎలాగైనా సరే వెంకట్ ను కలవాలని అనుకున్న చిరంజీవి , వెంకట్ కు, అతని భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి మరి హైదరాబాద్ కు రప్పించడం జరిగింది..

చిరంజీవి సుమారుగా 45 నిమిషాల పాటు వీరితో గడిపి మెడికల్ రిపోర్ట్స్ ను పరిశీలించి,మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాదులో ఉన్న ఒమేగా హాస్పిటల్ లో చెక్ అప్ కోసం పంపించారు . ఇక డాక్టర్ల తో మాట్లాడి వెంకట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నారు చిరంజీవి.. ఇక అన్ని రకాల పరీక్షలు చేయించి వైద్యులను సంప్రదించిన చిరంజీవి,  వెంకట్ సొంత ప్రాంతమైన విశాఖపట్నం లో ఉన్న హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి వారితో చర్చించారు.. అంతే కాదు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు అన్ని ఖర్చులు చూసుకుంటున్నానని తెలపడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి కోలుకునేలా చేస్తానని వాగ్దానం చేశాడు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: