సాహో సినిమా అనగానే ముందుగా హాలీవుడ్ రేంజ్ ను తలపించే యాక్షన్, సీన్, డైలాగులే గుర్తొస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. సినిమా కలెక్షన్ల పరంగా ఒక సునామీని సృష్టించిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఒక 25 సంవత్సరాల కుర్రోడు..అతనే డైరెక్టర్ సుజిత్.. కేవలం 25 సంవత్సరాల కుర్రోడు హాలీవుడ్ రేంజ్ లో ఎదుగుతున్న రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ను తన కథతో ఎలా మెప్పించగలిగాడు.. అతనిలో ఉన్న టాలెంట్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


సుజిత్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సినిమా అంటే బాగా పిచ్చి. ఇక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా వారు షాక్ కు గురయ్యారట. కొడుకును అతని మార్గంలో పంపించాలని ఆలోచించిన ఆ తల్లిదండ్రులు, వెంటనే సుజిత్  తల్లి ఒక కెమెరా ని కూడా కొన్ని ఇవ్వడంతో ఈయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కెమెరా రావడంతో వెంటనే షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేయడం మొదలుపెట్టాడు. సుజిత్ సైన్ తో మొదలైన ఐ నో స్టోరీ టెల్లింగ్ అని ఒక షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో లక్ష  వ్యూస్ నమోదు చేసుకోవడంతో సుజిత్ కు తనపై నమ్మకం బాగా కుదిరింది.

వరుసగా 40 షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. ఇక వెంటనే సినిమా తీయాలనుకున్నారు.. ఇకపోతే చిన్నప్పటినుంచి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే ఎనలేని అభిమానం. ఇక తన కథను ఎంతో మంది హీరోలకు వినిపించగా చివర్లో యు.వి.క్రియేషన్స్ వారు కూడా వినిపించడం జరిగింది. అప్పుడు వినిపించిన రన్ రాజా రన్ స్క్రిప్ట్ వారికి బాగా నచ్చడంతో , శర్వానంద్ కూడా చెప్పడంతో అతను కూడా ఓకే చెప్పేసాడు. ఇక అలా సెట్స్ మీదకు వెళ్ళి, ఈ కథ రన్ రాజా రన్  మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు శర్వానంద్ సినీ కెరియర్ కూడా ఈ సినిమాతో మారిపోయింది అని చెప్పవచ్చు. ఇక రన్ రాజా రన్ సక్సెస్ ఈవెంట్ లో ప్రభాస్ పరిచయం కాగా ప్రభాస్ కు  చిన్న లైన్ వినిపించాడు సుజిత్. తరువాత తెరకెక్కిన సినిమా సాహో..

సుజిత్ ఎవరో కాదు ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అనంతపురం కుర్రోడు. ఇక అసలు పేరు సుజిత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: