నందమూరి బాలకృష్ణ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ‘తాతమ్మకల’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈమూవీలో భానుమతి లాంటి మహానటి పక్కన బాలకృష్ణ నటించి మెప్పించాడు అప్పట్లో ఆమూవీ సూపర్ హిట్.


ఇప్పుడు మోక్షజ్ఞ కు 27 సంవత్సరాలు ఈవయసుకు ఎందరో యంగ్ హీరోలు ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. అలాంటిది ఇప్పటికి కూడ మోక్షజ్ఞ ఎప్పుడు ఫిలిం ఎంట్రీ ఇస్తాడో ఎవరికీ తెలియని పరిస్థితి. బాలకృష్ణ మటుకు తన కొడుకు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుంది అని చెపుతూనే ఉన్నాడు.


దీనితో బాలయ్య అభిమానులలో ఇంకా ఆశ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బాలయ్య సరికొత్త ఆలోచనలలో అనీల్ రావిపూడి వచ్చి చేరాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న గోపీ చంద్ మలినేని మూవీ పూర్తి అయిన తరువాత బాలయ్య అనీల్ రావిపూడి మూవీలో నటించవలసి ఉంది. ఇప్పటికే ఈమూవీ కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఈ చర్చలు మధ్య బాలయ్యకు ఒక ఆలోచన వచ్చింది అని టాక్. ఇప్పటివరకు అనీల్ రావిపూడి ఫెయిల్యూర్ అన్న పదం ఎరుగని దర్శకుడు.


దీనితో తాను అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోయే మూవీ కథలో మోక్షజ్ఞ కు సుమారు ఒక 20 నిముషాలు ఉండే ఒక కీలక పాత్రను క్రియేట్ చేసి తన పక్కన నటింప చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు బాలయ్యకు రావడంతో ఈ విషయమై బాలయ్య అనీల్ రావిపూడిల మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే అప్పుడు బాలయ్య ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ తో జరిగితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ‘తాతమ్మకల’ సెంటిమెంట్ తో జరుగబోతుంది అనుకోవాలి. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఇలాంటి వార్తలు ఎన్నో వినిపించాయి. మరి ఇప్పుడు కనీసం ఈవార్త అయినా నిజం కావాలని ఆశిద్దాం..




మరింత సమాచారం తెలుసుకోండి: