
అయితే కామెడీ కోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎటువంటి పనినైనా చేస్తానని అని చెబుతూ ఉంటాడు అది. అయితే ఇప్పుడు కూడా మరొకసారి అదే పని చేశాడు హైపర్ ఆది. ఈటీవీ లో ప్రసారమయ్యే దీపావళి స్పెషల్ ప్రోగ్రాంలో విడుదలైన ప్రోమోలో ఇది హైలెట్ గా నిలుస్తోంది. ఇందులో ఆది వేసిన కొన్ని పంచులు వింటే అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మా అధ్యక్షుడైన మంచు విష్ణు పైన ఎక్కువ పంచులు వేశాడు.
అయితే కొన్ని రోజుల కిందట మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తన స్కిట్ లో వాడడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా మంచు విష్ణు పై కొన్ని దారుణమైన ట్రోల్స్ ను చేశాడు. మా ఎన్నికల్లో జరిగిన గొడవలో మంచు విష్ణు మాట్లాడిన మాటలను తిరిగి ఇందులో హైపర్ ఆది మాట్లాడడం జరిగింది. ఇక మంచు విష్ణు , నరేష్ కలిసి మీడియా ముందు మాట్లాడిన మాటలను హైపర్ ఆది ఇక్కడ స్కిట్ రూపంలో చేసి చూపించాడు.
ఇక అంతే కాకుండా మంచు విష్ణు ఒక టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ ఎక్కువగా ట్రోల్ చేసాడు ఆది. ఇందులో నటి రోజా, ప్రియమణి, ఇంద్రజ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆది వేసిన పంచు డైలాగులకు అందులో ఉండే ఎటువంటి వారు కడుపుబ్బ నవ్వుకున్నారు. అయితే ఇలాంటి డైలాగులు మల్లెమాల సంస్థ ఒప్పుకోవడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.