ఒకప్పుడు టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ జయసుధ. దాదాపు అప్పట్లో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, మోహన్ బాబు, శోభన్ బాబు ఇలా అప్పటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సహజనటిగా సీనియర్ హీరోయిన్ జయసుధ ఎంతటి కీర్తిప్రతిష్టలు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అయితే అప్పటి అగ్ర హీరోయిన్లలో కొందరు బికినీ వేసి సంచలనం సృష్ఠించారు. అలాంటి వారిలో జయసుధ కూడా ఒకరు. జయసుధకి పాత్ర కోసం తనని తాను ఎలా అయినా మార్చుకోగల గొప్ప గుణం ఉందని అప్పట్లో దర్శక నిర్మాతలు అంటూ ఉండేవారు. హీరోయిన్‌గా ఎన్నో ఘన విజయాలను అందుకున్న నటి జయసుధ ఆ తరవాత వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుని రాణించింది.

అలా ఆమె  కెరీర్‌లో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో  మైల్ స్టోన్ లాంటి చిత్రాలు ఉన్నాయి. పెళ్ళి తర్వాత  కూడా ఈమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. నితిన్ కపూర్ ని 1985లో పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా పలు చిత్రాల్లో హీరోయిన్ గా కొనసాగారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నిగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి తనదైన ముద్ర వేసుకున్నారు నటి జయసుధ. అలా "అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి", "శతమానం భవతి", "బొమ్మరిల్లు" ఇలా ఎన్నో చిత్రాల్లో తన పాత్రలతో సినిమాకు కీలకంగా మారారు. ముఖ్యంగా అమ్మ నాన్నతమిళ అమ్మాయి చిత్రంలో రవితేజకు తల్లిగా నటించిన జయసుధ పాత్రకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు.

అంతగా కనెక్ట్ తయారు అంటే ప్రతి తల్లి కొడుకుల మధ్య బంధం ఇలానే ఉండాలి అనేలా ఆ పాత్రలో జీవించారు సహజనటి. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా అనగానే హీరో రవితేజ పేరుతో పాటు జయసుధ పేరు కూడా గుర్తుకు రావాల్సిందే. ప్రకాష్ రాజ్ భార్యగా, అలాగే రవితేజ తల్లిగా సీన్లు వారి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ లో సెంటిమెంట్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు జయసుధ. అయితే ఈ మధ్య కాలంలో ఆమె కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: