తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించే ఏ ఒక్కరైనా సరే మంచి పారితోషికం అందుకుంటున్నారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలుకొని స్టార్ హీరోలు, సింగర్స్ , దర్శకులు అందరూ కూడా ఒక్క రోజుకు కొన్ని వేల రూపాయలను మొదలుకొని లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకోవడం గమనార్హం. ఇకపోతే నటీనటుల విషయానికి వస్తే, సినిమా పూర్తయ్యే వరకు నటించి ఆ తరువాత కొన్ని కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ ఉంటారు. ఇకపోతే ఒక సినిమాకు కథ, కథాంశం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో.. అంతే స్థాయిలో పాటలు కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఇక తమ గాత్రంతో ఎంతో అద్భుతమైన పాటలను అందించే గాయనీగాయకులు కూడా ఒక పాటకు కొన్ని వేల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు అనే వార్త వినిపిస్తోంది. ఇకపోతే టాలీవుడ్ సింగర్స్ ఒక్కో పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రమ్య బెహ్రా - రూ.35,000, కౌసల్య - రూ.45,000, ఎస్పీ బాలసుబ్రమణ్యం రూ.3 లక్షలు, హేమచంద్ర రూ.40 వేలు, చిన్మయి-  రూ.1 లక్ష , గీతా మాధురి - రూ.45 వేలు, సునీత - రూ.1 లక్ష, మాళవిక - రూ.25 వేలు , శ్రీకృష్ణ - రూ.25 వేలు , శ్రావణ భార్గవి - రూ.50 వేలు , అంజన సౌమ్య - రూ.35 వేలు , చిత్ర - రూ.1 లక్ష ఇలా వీరంతా ఒక్కొక్క పాటకు ఇలా ఈ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు అని సమాచారం. అంతేకాదు వీరు కూడా సినిమా బడ్జెట్ ను బట్టి, ఆ సినిమాలో వారు పాడే పాటకు ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయంపై కూడా వీరి పారితోషకం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.


ఎప్పుడైనా వీరు పాడిన పాట సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అనిపిస్తే నెక్స్ట్ వీరు కూడా అమాంతం తన రెమ్యునరేషన్ని పెంచేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా సరే తమ క్రేజ్ ను పెంపొందించుకోవడానికి చూస్తారు కాబట్టి ఈ నేపథ్యంలోనే తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ మంచి పారితోషికం కూడా అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: