యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రస్తుతం ఏ రేంజ్ మార్కెట్ ఉందో మనందరికీ తెలిసిందే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఎవరికైనా పని చేయాలని ఉంటుంది, ఏ దర్శకుడైనా ప్రభాస్ లాంటి హీరోతో ఒక సినిమా నైనా తెరకెక్కించాలని ఏ టెక్నీషియన్ కైనా ఒకసారి ప్రభాస్ తో పనిచేయాలని, ఏ సంగీత దర్శకుడు కి అయిన ప్రభాస్ ఏ ఒక్క సినిమాకైనా సంగీతాన్ని అందించాలని ఉంటుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న తమన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రభాస్ ఇప్పుడు అంటే పాన్ ఇండియా స్టార్, కానీ మిర్చి సినిమా కంటే ముందు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరో. కానీ ఆ సమయంలో కూడా తమన్, ప్రభాస్ సినిమాకు పని చేయలేకపోయాడు.

 అయితే ఆ విషయాన్ని గురించి తెలియజేస్తూ తాజాగా సంగీత దర్శకుడు తమన్  ఒక విషయాన్ని చెప్పాడు.. ప్రభాస్ తో చాలా సంవత్సరాల క్రితమే పని చేయాల్సింది, అప్పట్లో రెబల్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. రెబల్ మ్యూజిక్ వర్క్ కూడా ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకు ఆ సినిమాకు తానే సంగీతం అందిస్తాను అని లారెన్స్ చెప్పాడు, నేను దానితో రెబల్ సినిమా నుండి తప్పుకున్నాను. ఆ తర్వాత ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రాలేదు, మళ్లీ ఆయన సినిమాకు వర్క్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తమన్ తెలియజేశాడు. తమన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పని చేయక పోయినప్పటికీ తెలుగు స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరో లతో పని చేసి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: