ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ తమ వైవాహిక జివితంలో సక్సెస్ కాలేకపోతున్నారు. ముందు లవ్ పేరిట దగ్గరవ్వడం.. క్లోజ్ గా మూవ్ అవ్వడం.. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని..కొంత కాలం అయ్యాక మా మధ్య బాండింగ్ లేదు..మనసులు కలవడం లేదు.. మనస్పర్ధలు వస్తున్నాయి మేమొ ఇక కలిసి ఉండలేం.. అంటూ విడాకులు తీసుకోవడం. ప్రస్తుతం ఇదే పరిస్ధితి ఎదురుకుంటున్నారు చాలా మంది సినీ సెలబ్రిటీస్. రీసెంట్ గా అమీర్ ఖాన్, సమంత విడాకుల మ్యాటర్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే.

కాగా గత వారం రోజుల నుండి బాలీవుడ్ హాట్ బ్యూటీ గ్లోబల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా  కూడా విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె చేసిన పనే. సోషల్ మీడియాలో తన అకౌంట్ నుండి భర్త నిక్ పేరుని తొలగించింది. మొదట సమంత కూడా ఇలానే తన అకౌంట్ నుండి అక్కినేని అనే ఇంటి పేరుని తీసేసింది. ఆ తరువాత విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించింది. ఇక ఇదే తరహాలో ప్రియాంకా కూడా ఫస్ట్ భర్త పేరుని అకౌంట్ నుండి తీసేసి..తరువాత డైవర్స్ ఇస్తుంది ఏమో అంటున్నారు నెటిజన్స్. దీంతో ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రియాంక చోప్రా ముందు సింగర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఆ తరువాత మెల్లిగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుని.. హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక  అమెరికాకు చెందిన సింగర్ అలాగే నటుడు  నిక్ జోనస్ ను ప్రేమించి ..ఆ విషయాని గుట్టుచప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేస్తూ..ఫైనల్ గా పెళ్లి కి ముహూర్తం పెట్టుకుని  మీడియా ముందుకు వచ్చింది. పెళ్లి తరువాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా చూడముచ్చటగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచింది. కానీ, సడెన్ గా ప్రియాంక మనసు ఎందుకు మారిందో అర్ధం కావడంలేదు. ఇక తాజాగా ఆస్ట్రోనామికల్ కాలిక్యులేషన్స్ అండ్ స్టార్ ఫేస్ రీడింగ్ ఆధారంగా జ్యోతిష్యుడు వీళ్ల జాతకాలు బట్టి కొన్ని రోజులు దూరంగా ఉండటమే మంచిదని.. లేకపోతే ఇద్దరు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారట. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి ఈ జంట ఏం చేస్తుందో..?



 

మరింత సమాచారం తెలుసుకోండి: