డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మంచి అనుబంధం ఉందని తెలియజేశారు. ఒకానొక సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఆడియో ఫంక్షన్ లో తన గురించి మాట్లాడడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.


త్రివిక్రమ్ మాట్లాడుతూ సీతారామ శాస్త్రి గురించి మాట్లాడాలంటే నా శక్తి సరిపోదు. సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన పాటల పైన రాసిన వాటిని నేను విన్న తర్వాత తెలుగు లో కూడా ఒక డిక్షనరీ అనేది ఉంటుందని అర్థం అయింది అని చెప్పుకొచ్చాడు. ఇక డిక్షనరీ తెచ్చుకొని నేను చదువుకున్నప్పుడు అందులోని కొన్ని విషయాలను తెలుసుకున్నాను. సీతారామ శాస్త్రి గారు ఆడియన్స్ కి ఇవే పాటలు అర్థమవుతాయా అనే ఉద్దేశంతో రాయకుండా.. కచ్చితంగా వారు అర్థం చేసుకుంటారని ఉద్దేశంతోనే పాటలు రాస్తారని తెలియజేశారు.


ఎవరైనా ఆయన పాటలు వింటే, ఆ పాటలు విన్న తర్వాత అందులోని అర్థం వెతుక్కొనే స్థాయిలో ఉంటారు యువకులు అని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక కవి అని తెలియజేశారు. కొన్ని మాటలను పలకడానికి కష్టంగా ఉన్నప్పుడు, ఆ మాటలను రాయడమే కాకుండా సినిమాలలో పాటల రూపంలో అందించడం కేవలం ఆయనకు ఒకటే సాటి అని తెలియజేశారు. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవిగా పేరు పొందారని తెలియజేశారు. అందుచేతనే ఆయనను మనం గౌరవించాలి అని తెలిపారు.

మనం చిరంజీవి లాంటి వ్యక్తిని చూస్తానే చప్పట్లు కొడతాం.. చిరంజీవి లాంటి వారికి "కదలి రాధ తనే వసంతం.." అనే పాటను రాయడానికి ఆయనకు ఎన్ని ఘాట్స్ ఉండాలి, ఆ పాటని సినిమాలు పెట్టడం కోసం దర్శకులను ఒప్పించాలి. ఒక దర్శకుడిగా ఆ విషయం నాకు తెలుసు అందుకనే ఆయన పాదాలకు నేను నమస్కారం చేస్తానని తెలిపారు. వెంకటేష్ లాంటి హీరోతో" బలపం పట్టి భామ వళ్ళో" ఈ పాటలు ఎన్నో అర్థాలను కూడా పొందుపరిచారు సీతారామ శాస్త్రి అని తెలియజేశారు.అందుకే ఆయన ఒక గొప్ప రచయితగా పేరు పొందారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: