సాధారణంగా ఒక సినిమా ను ఎంతో జాగ్రత్తగా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ముందు ప్రమోషన్స్ నిర్వహించడం కూడా అంతే ముఖ్యం.. అందుకే ప్రమోషన్ నిర్వహించడానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటుంది చిత్రబృందం. అదే సమయంలో ఇటీవలి కాలంలో అయితే ఇక సినిమా వాళ్లు ప్రమోషన్స్ చేసుకోవడానికి బుల్లితెర కార్యక్రమాలు ఒక మంచి వేదికగా మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నో బుల్లితెర కార్యక్రమాల్లో ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయ్.


 ఇక ఇలాంటి కార్యక్రమాలలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ దొరికినంత దోచుకో అనే కార్యక్రమం కూడా ఒకటి. ఇప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమం. అయితే ఇక క్యాష్ షో లో భాగంగా ప్రతివారం నలుగురు గెస్ట్ లు వచ్చి సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా విడుదల చేసే ముందు ఎంతో మంది ప్రమోషన్స్ కోసం ఇక ఈ కార్యక్రమానికి వస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల సత్యదేవ్ హీరోగా నిత్యమీనన్ హీరోయిన్ గా నటించిన స్కైలాబ్ చిత్రబృందం ఇటీవల క్యాష్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నిత్యామీనన్ మొదటిసారి బుల్లితెర కార్యక్రమాల్లో వస్తూ ఉండటంతో క్యాష్ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రోమో విడుదల అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే నిత్యామీనన్ ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి స్థాయి ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో మొత్తం ఎంతో సందడి సందడిగా సాగిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమో లో భాగంగా నిత్యామీనన్ ఎంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాదు షో జరుగుతున్నంతసేపు తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటుంది నిత్యమీనాన్ . ఇక ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త అందరినీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: