కాగా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన దేవిశ్రీ ప్రసాద్ త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. తన బీట్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దేవిశ్రీ ఇప్పుడు పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడు అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న దేవి ఫైనల్ గా తాను ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారట. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోయిన్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈయన..ఫైనల్ గా పెళ్లి చేసుకోవడాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పుష్ప సినిమాకు ప్రమోషన్స్ లో హెల్ప్ చేస్తున్న ఈయన..అతి త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అప్పట్లో హీరోయిన్ ఛార్మి, దేవిశ్రీప్రసాద్ ప్రేమించుకున్నారని పెళ్లికూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు ఆయన ఛార్మిని కాదని వేరే హీరోయిన్ తో పెళ్ళి చేసుకోవడానికి రీజన్ ఏంతో మాత్రం తెలియదు. మరి ఈ విషయం పై ఛార్మీ ఏమైనా మాట్లాడుతారు ఏమో చూడాలి..!!