ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే బయటకు వచ్చిన ఎన్టీఆర్, చరణ్ ల కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్లు, అలానే మూడు సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకోవడంతో పటు సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచాయి. భారీ పాన్ ఇండియా సినిమాగా పేట్రియాటిక్ మూవీ గా కొన్ని ఫిక్షన్ అంశాలతో రాజమౌళి ఈ సినిమాని ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు విడుదల చేయనుంది యూనిట్. అయితే మొదటగా ట్రైలర్ ని ఉదయం 10 గంటలకు ఆంధ్రా, తెలంగాణ లోని మొత్తంగా ఎంపిక చేసిన 300 థియేటర్స్ లో రిలీజ్ చేసేలా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్లాన్ చేసింది.
ట్రైలర్ ని చూడాలనుకున్న ప్రేక్షకాభిమానులు తమ ఊళ్లలోని ఆయా థియేటర్స్ కు వెళ్లి ఎటువంటి టికెట్ అవసరం లేకుండా వీక్షించవచ్చని ఆర్ఆర్ఆర్ యూనిట్ నేడు వెల్లడించింది. అలానే యూట్యూబ్ లో సాయంత్రం 4 గంటలకి ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు యూనిట్. మొత్తంగా ఈ విధంగా సరికొత్త స్టైల్ లో థియేటర్స్ లో ప్రత్యేకంగా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ ఆర్ఆర్ఆర్ యూనిట్ సినిమాకి మరింతగా హైప్ తీసుకువస్తూ అందరిలో మరింతగా మూవీపై అంచనాలు పెంచుతోంది. కాగా ట్రైలర్ రిలీజ్ తరువాత ఆర్ఆర్ఆర్ మూవీ పై తప్పకుండా ప్రేక్షకాభిమానుల్లో హైప్ ఆకాశమంత ఎత్తుకి ఎదగడం ఖాయం అంటూ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది.