ఆర్ ఆర్ ఆర్.. సినిమా 2022 జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా ఘనంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా జక్కన్న వ్యవహరించగా..మెగా వారసుడు రామ్ చరణ్, నందమూరి వారసుడు ఎన్టీఆర్ సమరయోధులుగా మనకు కనిపించబోతున్నారు. ఇక ఆలియా భట్ , వొలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇక శ్రియ, అజయ్ దేవగన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విడుదల కావడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో వేగంగా పాల్గొంటున్నారు చిత్రం యూనిట్ సభ్యులు.


ఇప్పటికే తెలుగులో హైదరాబాద్ లో భారీ ఏర్పాటు చేసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ముంబైలో కూడా భారీ స్టేజ్ ను  ఏర్పాటు చేసి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సినిమా గురించి.. తమ వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించారు.. తారక్, జక్కన్న అలాగే రామ్ చరణ్. అయితే ఇప్పుడు మూడోసారి ముచ్చటగా తమిళనాడు రాష్ట్రం చెన్నైలో కూడా సినిమా ప్రమోషన్స్ కోసం భారీ స్టేజ్ ను ఏర్పాటు చేసి  ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఈ ఈవెంట్ కి అతిరథమహారధులు పాల్గొని ఈవెంట్ ను  సక్సెస్ ఫుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.


ఇక చెన్నైలో ఈ చల్లని సాయంత్రం వేళ ఘనంగా నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన శివ కార్తికేయన్ తో పాటు ఉదయ్ నిధి  కూడా ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. వీరిని జక్కన్న ఆప్యాతగా పలకరించారు. ఇక ప్రస్తుతం ఈ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరోసారి ఇంకెక్కడ నిర్వహిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: