కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల తరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోల మధ్య ఐఖ్యత బాగా పెరిగింది. టాప్ హీరోలు నటించిన ఏసినిమా విజయం సాధించినా మిగతా టాప్ హీరోలు అంతా అది తమ విజయంగా భావిస్తూ ఇది ఇండస్ట్రీ విజయం అంటూ ఒకరి పై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు.
ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది ‘పుష్ప’ లో నటించిన నటీనటులు అందర్నీ పేరు పేరునా ప్రశంసిస్తూ ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ లపై ప్రత్యేకంగా మహేష్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు ఈవిషయమై మహేష్ అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది రెండు సంవత్సరాల క్రితం ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠ పురములో’ మూవీలు ఒక దానిపై ఒకటి పోటీగా విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బన్నీ అభిమానుల మధ్య ఒక పెద్ద మాటల వార్ జరిగింది.
అప్పుడు ఆ వార్ ను ఆపుచేయమని బన్నీ మాటవరసకు అయినా తన అభిమానులకు సూచన ఇవ్వకపోవడం మహేష్ అభిమానులను బాధకు గురిచేసింది. అయితే ఇప్పుడు ఆ విషయాలను మర్చిపోయి ఏమి జరగనట్లుగా మహేష్ బన్నీ పై ఈ రేంజ్ లో ప్రశంసలు ఏమిటి అంటూ మహేష్ అభిమానుల వాదన. అయితే టాప్ హీరోలు అంతా అవకాశం వచ్చినప్పుడల్లా ఒకే మాట చెపుతారు. తాము అంతా ఒకటే అనీ అనవసరంగా ఆ విషయంలు తెలియక తమ అభిమానులు అనవసరపు వివాదాలకు అవకాశాలు కల్పిస్తున్నారు అంటూ కామెంట్స్ కూడ చేస్తుంటారు. అయితే హీరోల అభిమానులు మాత్రం ఇవేమీ పట్టించుకోరు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి