ప్రస్తుతం జరిగే పరిణామాలు చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీకి గుడ్ టైం నడుస్తున్నట్లే ఉంది. గత కొంత కాలంగా హిట్ సినిమా పడని నాగార్జున కొడుకు అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వార బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం. ఇక సంక్రాంతికి తమ సినిమా విడుదల చేయలని భావించి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బంగార్రాజు మూవీ..బడా సినిమాలు రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడంతో సంక్రాంతి ఆశలు వదులుకుని వెనక్కు వెళ్లాలని అనుకుంటుండగా..ఎవ్వరు ఊహించని విధంగా కరోనా కేసులు పెరగడం..దీంతో పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలు పెట్టడం..ఇక ఇలాంటి టైం లో సినిమా రిలీజ్ చేస్తే లాస్ అవుతుందని ఏం చేయలేక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన పెద్ద సినిమాలు అయిన ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యాం సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం నాగార్జున బంగార్రాజు సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక అనూహ్యంగా పెద్ద సినిమాలు సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడంతో బంగార్రాజు సినిమాకు లైన్ క్లియర్ అవ్వడం..నేడు ధియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం చకచకా జరిగిపోయాయి.

ఎన్నో ఆశలతో సంక్రాంతి పండుగ కానుక రిలీజైన  బంగార్రాజు మూవీని చూసిన జనాలు ఇది నిజంగా పండగలాంటి సినిమానే అని చెప్పుకొస్తున్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సినిమాను ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా తీసుకెళ్లిపోయాడు. ముఖ్యంగా ఈ సినిమా లో నాగచైతన్య పర్ ఫామెన్స్ అద్దిరిపోయింది అంటున్నారు సినిమా చూసిన అభిమానులు.  ఫస్ట్ టైం  మాస్ లుక్ లో కనిపించిన చైతన్య అభిమానుల అంచనాలను డబుల్ చేసాడనే చెప్పాలి.

ఇక ఆయన పక్కన హీరోయిన్ గా  కృతి కూడా ఏం మాత్రం తగ్గకుండా నాగలక్ష్మి రోల్ లో చించేసిందని అంటున్నారు అభిమానులు . సినిమా కొంచెం స్లోగా సాగిన అక్కడక్కడ కొంచెం సస్పెన్స్ సీన్స్ పెట్టి  డైరెక్టర్ బాగా కవర్ చేసాడని రివ్యూ  ఇస్తున్నారు సినిమా చూసి వచ్చిన జనాలు. ఇక ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే సినిమాని చూడచ్చు అనేలా ఉందట ఈ బంగార్రాజు సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: