తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత సూపర్ స్పీడ్ తో దూసుకుపోతోంది. విడాకుల తర్వాత సినిమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ విడాకుల తర్వాత మరింత స్పీడ్ పెంచేసింది సమంత. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది. దీంతో టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాలకు సైన్ చేసేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా మత్తెక్కిస్తోంది సమంత.


 ఇక సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతుంది యశోద సినిమా. సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ లేడి ఓరియంటెడ్ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుండడం గమనార్హం. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అయితే సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో సమంత హీరోయిన్గా నటించాల్సి ఉంది. కాని ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కె అవకాశం కనిపించడం లేదు.


 దీంతో స్టార్ హీరోయిన్ సమంత కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యశోద సినిమా తర్వాత సమంతతో మరో లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం టాలీవుడ్లో చక్కెర్లు కొడుతుంది. దీని గురించి మరి కొన్ని రోజుల్లో సమంతను కలవబోతున్నాడట మాటల మాంత్రికుడు. సమంత ఓకే చెప్పిందంటే ఎలాంటి ఆలస్యం లేకుండానే సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడట త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్ చెప్పిన కథకు సమంత ఊ అంటుందా ఉహూ అంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: