పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయ్యాడు, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్,  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్లా నాయక్ సినిమాను కొంత కాలం క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను జనవరి 12 వ తేదీన కాకుండా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

 అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఉద్ధృతంగా పెరిగిపోవడంతో ఫిబ్రవరి నెలలో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు, ఇప్పటికే చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కావలసి ఉంది, కాకపోతే ప్రస్తుతం కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన కాకుండా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  అయితే భీమ్లా నాయక్ సినిమా కూడా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కావడం కష్టమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: