ఈ మధ్య వస్తున్న సినిమాలు రొమాంటిక్ యాంగిల్ అంతకు మించి అన్నట్టుగా ఉంటున్నాయి. కానీ అసభ్యంగా లేని శృంగారాన్ని తెరపై పడించడం కూడా ఒక ఆర్టు దాన్ని పండించి క్రెడిట్ దక్కించుకోవాలి అంటే ఆ సినిమా దర్శకుడిపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కోణంలో రూపుదిద్దుకుని రికార్డులు సృష్టించిన చిత్రం 'ఏమాయ చేసావే'. గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో యంగస్టర్స్ కు నచ్చే లవ్ సీన్స్ ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చిపెట్టే అంతపెద్ద సక్సెస్ ను అందించాయి అనడంలో సందేహం లేదు.

ఈ సినిమాలో నాగచైతన్య, సామ్ ల మధ్య కెమెస్ట్రీ బాగా పండింది, వరుస లిప్ లాక్ లు యువత మతులు పోగట్టాయి. ఈ సినిమా లో చై, సామ్ ల జంటను చూసిన ప్రేక్షకులు వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా ఒకటవ్వాలని గట్టిగా కోరుకున్నారు. అలాగే వారి ఆకాంక్ష నిజమయ్యింది కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అయిదేళ్ళ వివాహబంధం ఉన్న వీరు  ఇటీవలే విడిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం అటుంచితే ఈ సినిమా చై,సామ్ ల కెరియర్ లో ది బెస్ట్ సినిమాలలో ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమాలో హద్దు లు మీరని కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ఫైనల్ గా ట్రైన్ లో ముద్దు పెట్టుకునే సీన్ కి థియేటర్ లో రెస్పాన్స్ దద్దరిల్లింది.  

తమిళ్ లో త్రిష,శింబు హీరో, హీరోయిన్లుగా నటించిన 'విన్నైతాండి వరువాయ' అనే సినిమాకి రీమేక్ ఇది. నాగ చైతన్య తొలి చిత్రం జోష్ తో నిరాశ పడ్డ అక్కినేని అభిమానులు ఈ సినిమాలో నాగ చైతన్య నటనా పరిణితిని చూసి అంతా అవాక్ అయ్యారు. ఈ సినిమాలో లవ్ సీన్స్ స్లో గా నడిచినప్పటికీ ఫీల్ గుడ్ గా మనసుని మైమరిపిస్తూ మరో ప్రపంచానికి తీసుకెల్లాయి. మొత్తానికి ఈ సినిమా మితిమీరని స్మార్ట్ రొమాంటిక్ సీన్స్ తో అన్ని వర్గల్ ప్రెకషకులను ఆకట్టుకుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: