కొంతమంది దర్శకులకు ఎలా అదృష్టం కలిసి వస్తుంది అంటే వారి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా హీరోలు మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు. సదరు దర్శకులకు మన టాలీవుడ్ లో కథను నమ్మి ఛాన్స్ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. వారి గత సినిమాల ప్రభావం పడకుండా చూసుకుంటూ తన సినిమా పై శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళుతుండగా ఈ సంవత్సరం విడుదల కాబోయే కొన్ని సినిమాల దర్శకులు గత సినిమాలతో భారీ ఫ్లాపులు అందుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు పెద్ద హీరోల అవకాశం అందుకోవడం విశేషం. అలాంటి దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

రవితేజ హీరోగా ఇటీవలే సుధీర్ వర్మ అనే దర్శకుడు రావణాసుర అనే చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా కార్యక్రమానికి వచ్చి ఎంతో గ్రాండ్ గా చేశారు. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం లో ఎప్పుడూ ముందుండే రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వం అవకాశం ఇవ్వడంలో ఆశ్చర్యం లేకపోయినా కూడా ఆయన గత చిత్రం రణరంగం సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో రవితేజ ఆయనకు సినిమా అవకాశాలు ఇవ్వడం ఆయన అభిమానులను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. 

ఇక క్రిష్ జాగర్లమూడి పోయిన సంవత్సరం వాయిస్ నౌ తేజ్ తో కొండపురం అనే సినిమాను చేసి భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఎరక్కపోయి తిరుగుతున్నట్లు అయినా క్రిష్ సినిమా ఫ్లాప్ చేసిన కూడా పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ఆయనకు ఇంకా అవకాశం ఇవ్వటం ఒక్కసారిగా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇక దర్శకుడు రమేష్ వర్మ రవితేజతో కిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఆయన గత చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: