టాలీవుడ్ లో అతి కొద్దిరోజుల్లోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ ఊర మాస్ కథతో వస్తున్నాడు. సినిమా నుండి శాంపిల్ టీజర్ గా వదిలిన ఫస్ట్ గ్లింప్స్ దుమ్ముదులిపేయగా పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు రెట్టింపు అయ్యాయి. పూరీ మార్క్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తున్న లైగర్ సినిమాలో బాలీవుడ్ అందాల భామ అనన్యా పాండే హీరోయిన్ గా అదరగొట్టనుందని తెలుస్తుంది.

లైగర్ సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఓ స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కంపల్సరీ.. సీరియస్ గా సినిమా నడుస్తున్న టైం లో మాస్ ఆడియెన్స్ ని అలరించేందుకు ఓ మాంచి ఊపున్న మసాలా సాంగ్ వస్తే ఆ కిక్ డబుల్ అవుతుంది. ఇక పూరీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కి చాలా ప్రత్యేకత ఉంది. అప్పుడెప్పుడే 16, 17 ఏళ్ల క్రితం వచ్చిన ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాట ఇప్పటికీ వినిపిస్తుంది.

విజయ్ లైగర్ సినిమాలో కూడా అలాంటి ఓ అదిరిపోయే ఐటం సాంగ్ ఉంటుందని టాక్. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామలని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రిలీజ్ కాకున్నా ఆ సినిమా చూసిన బాలీవుడ్ భామలు విజయ్ దేవరకొండ మీద మనసు పారేసుకున్నారు. ఈ క్రమంలో విజయ్ లైగర్ లో స్పెషల్ సాంగ్ కి బాలీవుడ్ భామలు చేసేందుకు రెడీగా ఉన్నారట. పుష్ప సినిమా కోసం సమంత చేసిన ఉ అంటావా సాంగ్ రికార్డులు సృష్టించింది అందుకే ఇప్పుడు అందరి ఫోకస్ లైగర్ స్పెషల్ సాంగ్ పై పడ్డది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: