పండగ సీజన్ లో సినిమాలను తీసుకురావాలని ప్రతి ఒక్క హీరో కూడా అనుకుంటాడు. ఎందుకంటే పండుగ సమయాల్లో ప్రేక్షకులు సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా సంక్రాంతి దసరా ఉగాది ముఖ్యమైన పండుగ సమయాల్లో పెద్ద హీరోల సినిమాలు  విడుదల అవుతూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. అంతేకాదు భారీ వసూళ్లను కూడా తెచ్చిపెడతాయి. అందుకే నిర్మాతలు దర్శకులు హీరోలు అందరూ కూడా ఫెస్టివల్ సీజన్ ను ఎంపిక చేసుకొని సినిమాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారు.

ఆ విధంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తమ సినిమాలను తీసుకురావాలని ఓ ముగ్గురు హీరోలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఇంకా మొదలవలేదు కానీ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని మహేష్ బాబు ఇప్పటికే దర్శక నిర్మాతలకు సూచించాడట. ఆ విధంగానే వారు పనులు చేపడుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తాను శంకర్ దర్శకత్వంలో చేయబోయే భారీ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని పట్టుబడుతున్నాడట.

ఇక రెండు భారీ సినిమాలు విడుదల అయితే సంక్రాంతి సీజన్ లో భారీగా నష్టం వస్తుందని భావిస్తున్న సినీ పెద్దలకు మరో తలనొప్పి కూడా మొదలైంద ట. క్రిస్మస్ కానుకగా విడుదలైన పుష్ప రెండో భాగం భారీ సక్సెస్ సాధించి కోటాను కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో పుష్ప రెండవ భాగం సినిమాకు సంబంధించిన విడుదల జరగనున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.సంక్రాంతి కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్ల ను తీసుకువస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: