తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున హీరోలుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 30 సంవత్సరాల నుంచి తమ స్టార్ డమ్ ను ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ సీనియర్ హీరోలు. ఇక వీరిద్దరూ సెట్స్ లో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ మాత్రం ఈ ఇద్దరు హీరోలు మాత్రం సెట్ లో ఎలా ఉంటారో తాజాగా వెల్లడించారు. ఇక అతను మరెవరో కాదు కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్నాచితక పాత్రలు చేసుకుంటూ ఇటీవల బాగా పాపులారిటీ తెచ్చుకున్న నాగ మహేష్.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు ఈ నటుడు. ఇప్పటికే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సినిమాలలో నటించాడు. ఇక ఇటీవల బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయన.. నాగార్జున హీరోగా సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమా లో సైతం ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు ఇంటర్వ్యూలో నాగార్జున గురించి మాట్లాడుతూ..' 60 సంవత్సరాలు దాటిన కూడా నాగార్జున ఇంకా స్లిమ్ గా కనిపిస్తారని.. నాగార్జున, నాగచైతన్య పక్కపక్కనే ఉంటే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారని తెలిపాడు.

 ఇక బాలయ్య గురించి చెబుతూ..' ఒక సినిమాలో బాలకృష్ణ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన సెట్లో అందర్నీ కలుపుకుంటూ చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. నాగార్జున మాత్రం ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడతారు. మిగతా సమయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటారని తెలిపారు. ఇక నాగచైతన్య కూడా సింప్లీ సిటీ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. నాగార్జున బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాను. ఇక త్వరలోనే వెంకటేష్ గారితో కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను' అంటూ ఆ ఇంటర్వ్యూలో తెలియజేసాడు నాగ మహేష్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: