పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. ఎపిలో జరుగుతూన్న పరిస్థితుల పై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. దీక్షలు కూడా చేస్తూ అభిమానులకు, ప్రజలకు దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాలు చేయాలంటే కొత్త కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది.


భీమ్లా నాయక్ విడుదల కు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశ లో ఉన్నాయి. ఈ సినిమాల తో పాటుగా మరో కొన్ని సినిమాలు సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరి కి పవన్ విషయం లో ఆందోళన పట్టుకున్నదని తెలుస్తుంది. పవన్ కొత్తగా ఒక కండిషన్ పెట్టారని, దాని వలన డైరెక్టర్లందరూ సమస్యల తో సతమతం అవుతున్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమ లోని నిర్మాతల కు టెన్షన్ పట్టుకుంది.  


పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ ఏంటీ అంటే.. పవన్ షూటింగ్ కోసం కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇస్తానని, అంతకుమించి ఎక్కువ రోజులు కుదరదని తేల్చి చెప్పాడట. ఏం చేసినా.. తాను ఇచ్చిన 60 రోజుల్లోనే తన షూటింగ్ పార్టు ను ముగించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే దర్శకులకు టెన్షన్ తప్పదు. హీరో కాల్షీట్లు తక్కువ ఉంటే షూటింగ్ ని బిజీ బిజీగా పూర్తీ చెయాల్సి వస్తుంది..రాజకియాల్లొ చురుగ్గా వుండాలని ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సారి రానున్న ఎన్నికలకు గట్టి  పోటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు  అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: