వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా 'అయ్యప్పనున్ కోషియం' అనే సినిమాకి అధికారిక రిమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు రీమేక్ రన్ టైం మాత్రం చాలా తగ్గిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

మలయాళ అయ్యప్పనున్ కోషియం' సినిమా నిడివి సుమారు 175 నిమిషాలు ఉంటుంది. అంటే దాదాపు మూడు గంటలు అన్నమాట. అయితే తెలుగు వెర్షన్ రన్ టైం విషయంలో మాత్రం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమా నిడివి మొత్తం కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో నుంచి చాలా తక్కువ నిడివి తో వస్తున్న సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రీమేక్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశాడు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని సాంగ్స్ ని కూడా ఆడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రానా కంటే పవన్ పాత్ర కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. అయితే సినిమా స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా సినిమా రన్ టైం మరి రెండు గంటల 10 నిమిషాలకు కుదించడం ఏంటని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి చివరికి చిత్ర యూనిట్ ఇదే రన్ టైం తో సినిమాని విడుదల చేస్తారా? లేదా? అనేది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: