ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమా.. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయ్యింది. షూటింగ్ పనులు దాదాపు పూర్తీ అయ్యింది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచుస్తున్నారు. గతంలో వచ్చిన మహేష్ సినిమాలు అన్నీ భారీ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అంతటి ఘన విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్ సర్కారు వారి పాట పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో అలరించనున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. అంతేకాదు మహేష్ బాబు కాలికి సర్జరీ కూడా జరిగిన విషయం తెలిసిందే..  
కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.


తమన్ సంగీతం అంటే సినిమా హిట్ అవుతుందని అందరికి తెలుసు. అఖండ సినిమాకు భారీ హిట్ ను అందుకున్న తమన్ పేరు మారుమోగిపోతుంది. భీమ్లానాయక్ నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రముఖ గాయిని గీతా మాధురి మరియు తమన్ లు ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా గురించి కూడా ముచ్చటిస్తున్నారు. ఈ సినిమా రింగ్ టోన్ ల మార్పు గురించి చెప్పాడు. అలా చూస్తె ఈ సినిమా రింగ్ టోన్ లు మారుథున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందె..మరింత సమాచారం తెలుసుకోండి: