సాధారణంగా ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరో హీరోయిన్లను ఒక్కసారి కలిస్తే చాలు అని. అంతేకాదు ఇక తమ అభిమాన హీరోలను ఒక్కసారి ముట్టుకుంటే జన్మ ధన్యం అయిపోయినట్లే అని భావిస్తూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. అందుకే ఎక్కడకైనా తమ అభిమాన హీరో వచ్చాడు అంటే కష్టపడి అక్కడికి వెళ్లి హీరోలను కలవడం లాంటివి చేస్తూ ఉంటారు.. కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా తమ అభిమాన హీరో హీరోయిన్ల విషయంలో ఇలాంటి కోరికలు ఉంటాయి అన్నది ఇప్పుడు తెలుస్తోంది. ఇటీవలే ప్రగ్యా జైస్వాల్ ఏకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నూ మిమ్మల్ని ఒక సారి ముట్టుకోవచా అని అడిగి షాక్ ఇచ్చిందట.


 ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ప్రగ్యా జైస్వాల్. తెలుగుతో పాటు కన్నడ తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇటీవలే అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించి  బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ప్రగ్యా జైస్వాల్. గత కొన్ని రోజుల నుంచి ప్లాప్ సినిమాలతో సతమతమైన ప్రగ్యా జైస్వాల్ కు అఖండ సినిమా హిట్ మళ్లీ ట్రాక్ లో పడేలా చేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రగ్యా జైస్వాల్ మరిన్ని అవకాశాలను అందుకుంటుంది. ఇకపోతే ఇటీవలే సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ప్రగ్యా జైస్వాల్.


 ఈ సమయంలో సల్మాన్ ఖాన్ తో తన అనుభవాలను ఇటీవలే అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ ఖాన్ ను షూటింగ్ స్పాట్ లో కలిసాను. ఇక ఆయనను కలిసిన మొదటి రోజే మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా అని అడిగాను. ఇక నేను అలా అడగగానే సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఏం పర్లేదు ముట్టు కోండి అంటూ చెప్పారు. ఇక సల్మాన్ ఖాన్ అలా అనడంతో ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను అంటూ ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సాంగ్ షూటింగ్ మొత్తం ఎంతో సౌకర్యవంతంగా సాగిపోయింది అంటూ ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: