ఓటిటి కంటెంట్ డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మన అందరికీ తెలిసిందే, ఒకానొక సమయంలో చిన్న తరహా నటీనటులు, మీడియం రేంజ్ నటీ నటులు మాత్రమే ఓటిటి లలో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవారు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చాలావరకు తగ్గాయి.  సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్న వారు కూడా ఓటిటి వైపు మొగ్గు చూపుతున్నారు, ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ లు సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ ఓటిటి కంటెంట్ లో నటించి ఎంత మంది ప్రేక్షకుల ఆదరణ పొందారు. అయితే ఇదే బాటలో ప్రస్తుతం కొంత మంది స్టార్ హీరోలు కూడా పయనిస్తున్నారు, ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వున్న నాగ చైతన్య కూడా ఓటిటి కంటెంట్ లో నటిస్తున్నాడు,  నాగ చైతన్య ఓటిటి లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు, ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ ఓటిటి సంస్థ నిర్మిస్తోంది.

 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నాగ చైతన్య ఓటీటీ  లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్ట్గా, నెగెటివ్ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య మేకోవర్ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్, మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ను ప్రసారం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక్కో సీజన్ లో 8 నుండి 10 ఎపిసోడ్ ల వరకు  ఉండబోతునట్లు తెలుస్తుంది, అలాగే ఈ వెబ్ సిరీస్ టైమ్ ట్రావెల్ స్టోరీ అని  కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి, మరికొన్ని రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య,  విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, అలాగే అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో  కూడా నాగ చైతన్య ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: