విజయ్ దేవరకొండ ఓ నార్మల్ హీరోగా తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించబోతున్నాడు.  ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి హాజరు కావడం దానికి నరేంద్ర మోడీ కూడా హాజరు కావడం విశేషం అని చెప్పాలి.

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కోసం నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రాంతానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రాంతాలపై తెలుగు సినిమా పరిశ్రమ పై భారీ స్థాయిలో ప్రశంసలు జల్లు కురిపించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి అద్భుతాలు సృష్టిస్తుందని ఆయన అన్నారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ జరిగిన తరువాత ప్రసంగించిన నరేంద్ర మోడీ సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ సినిమాలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాయని అన్నారు.

అంతే కాదు సిల్వర్ స్క్రీన్ నుంచి ఓ టీ టీ వరకు ఏ తెలుగు సినిమా వచ్చినా కూడా ప్రపంచ వ్యాప్త చర్చ జరిగే విధం గా ఉన్నాయని ఆయన వెల్లడించా రు.  ఇక విజయ్ దేవరకొండ చూసి ఆయన మాట్లాడుతూ ఈ విధమైన ప్రసంగం చేయడం నిజంగా తెలుగువారికి గర్వకారణంగా అని చెప్పవచ్చు. ఇక ఈ స్పీచ్ లో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావ డం గర్వకారణం అని ఆయన అన్నారు. అంతేకాకుండా పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించారని మోడీ తెలంగాణ ప్రాంతాలను సంప్రదాయాలను వృత్తి విధానాలను ప్రశంసించారు. ఇక ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ కూడా హాజరయ్యారు 

మరింత సమాచారం తెలుసుకోండి: