సినిమా రంగం ఎందరో మహానుభావులను చూసింది. అందరూ తమదైన నటనతో ప్రేక్షకులను రంజింపచేశారు. అయితే దేవుడు ఇచ్చిన సమయం ప్రకారం అందరూ చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత అతి కొందరు మాత్రమే ప్రజల మనసుల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోతారు. అలంటి వారిలో ఒకరే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయితే ఇతని జీవితంలో గడిచినది 40 సంవత్సరాలే అప్పుడే దేవుడు తనను తీసుకు వెళ్ళిపోయాడు. ఈ విషాదం నుండి కన్నడ పరిశ్రమ తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. కానీ కన్నడ నాట ఈయన అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

అంతలా ఇతనిని తమ గుండెళ్ళో పెట్టుకుని చూసుకున్నారు. ఈయన మరణాన్ని అటు టాలీవుడ్, కోలీవుడ్ సైతం జీర్ణించుకోలేకపోయింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, విశాల్, శివ కార్తికేయన్ లాంటి నటులు ఈయనకు నివాళులు అర్పించారు. అయితే ఇప్పుడు రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం గురించి ఒక అప్డేట్ వచ్చింది. పునీత్ తన కెరీర్ లో చివరి సారిగా నటించిన చిత్రం జేమ్స్. ఈ సినిమాను అభిమానులు అందరికీ కలకాలం గుర్తుండిపోయేలా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే నెల 17 న విడుదల కానుంది. అయితే ఈ సినిమా టీజర్ ను నేడు విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ చిత్రంలో పునీత్ నటన మాములుగా లేదంటూ చిత్ర బృందం అంటున్నారు. జేమ్స్ పూర్తిగా యాక్షన్ ప్రధానముగా తెరకెక్కించింది కావడం వలన పునీత్ నుండి ఎక్కువగా ఆశిస్తున్నారు అభిమానులు. ఈ టీజర్ మొత్తం పునీత్ డైలాగ్స్ తో సరికొత్తగా ఉంది. ఈ సినిమాలో శ్రీకాంత్ మరియు శరత్ కుమార్ లు ముఖ్య పాత్రలలో చేస్తుండడం విశేషం.




మరింత సమాచారం తెలుసుకోండి: