సైన్స్ ఫిక్షన్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు మరిన్ని వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు ఈ హీరో. అయితే తేజ నటించిన సినిమాలు అటు ప్రేక్షకులు కూడా బాగా ఆకర్షిస్తుండటంతో హీరో నుంచి ఏదైనా సినిమా వస్తే అదేదో కొత్త కాన్సెప్ట్ అయి ఉంటుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతలా తన సినిమాలతో ప్రభావం చూపించాడు ఈ హీరో. ఇకపోతే ప్రస్తుతం తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమానే.
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే విడుదలకు ముందే ఈ యువ హీరో సినిమాకి మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది అని తెలుస్తోంది. విడుదలకు ముందే ఏకంగా 16 కోట్ల బిజినెస్ చేసింది తేజ సజ్జ హనుమాన్ సినిమా. హిందీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఐదు కోట్లకు అమ్ముడు పోయాయి. ఇక తెలుగు వర్షన్ డిజిటల్ రైట్స్ కి జీ సంస్థ 11 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాంబి రెడ్డి దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి