బిగ్ బాస్ షో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం మంచి పాపులారిటీ ఉన్న షో అని చెప్పవచ్చు. టిఆర్పి రేటింగులు అన్ని షోల కంటే ముందు వరుసలో ఉండనే ఉంటుంది ఈ షో.. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు కూడా సినీ అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుచేతనే బిగ్ బాస్ షో ఇంతటి పేరు సంపాదించింది అని చెప్పవచ్చు.. అయితే తెలుగులో బిగ్ బాస్ షో కి అక్కినేని నాగార్జున పోస్టు గా వ్యవహరిస్తున్నారు. ఇక తమిళంలో కమల్ హాసన్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.


అయితే ఇప్పుడు తాజాగా ఈ హౌస్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నట్లు గా ప్రకటించడం జరిగింది.. కమల్ హాసన్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారు లో సోషల్ మీడియాలో పలు కథనాలు రావడం జరిగింది. కరుణ పరిస్థితులలో విక్రమ్ మూవీ పై తన ప్రభావం చూపుతోందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదని.. అందుచేతనే కమల్ హాసన్ పోస్ట్ నుంచి తప్పుకున్నట్లు గా సమాచారం. అయితే యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కమల్హాసన్ తెలియజేశాడు. ఇక ఖైదీ, మాస్టర్, వంటి సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ మూవీని తెరకెక్కిస్తున్నారు.


ఇక ఇందులో కమల్ హాసన్ తో పాటుగా విజయ్ సేతుపతి, మరొక విలక్షణమైన నటుడు ఫాహద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఫస్ట్ క్లిప్స్ పై కూడా మరింత అంచనాలు పెంచేసింది కనిపిస్తున్నాయి. ఇక కమల్ హాసన్ ఈ సినిమాని 232 వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ మీసాలు గడ్డలతో ఈ సినిమాలో అభిమానులను అలరించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: