తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్నటి వరకూ భీమ్లానాయక్ సినిమా టాక్ ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా జనాలు అంత రాధేశ్యామ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయిన అందరినీ విపరీతంగా ఆకర్షించింది. దాంతో సినిమా పై అంచనాలు ఆ రేంజ్‌లో పెరిగిపోయాయి. రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ను  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.. ఈ  పీరియాడికల్ లవ్ డ్రామాని 2022 మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియెటర్ల లోకి తీసుకురానున్నారు.


గత కొద్ది రోజులుగా రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో జోరు పెరిగింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను పెంచాయి. ఇందులో ఎలాంటి ఫైట్స్ లేవని మేకర్స్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ను చూస్తె సినిమాలో విలన్ అనేవాడు లేదని అర్థమవుతోంది.. ఒక మంచి ప్రేమ కథ మాత్రమే కాదు అంతకు మించిన ట్విస్టులు కూడా ఉన్నాయని తెలుస్తుంది.కృష్ణంరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


కీలక పాత్రలో కూడా ఆయన భాగ్యశ్రీ నటిస్తున్నారు.. ఎంతోమంది ప్రముఖులు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం చైనీస్ తో మరొ కొన్ని బాషల్లొ సినిమా విడుదల అవుతుంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ జనాల అంచనాలను మరింత పెంచాయి. ఇప్పుడు మరో అప్డేట్ ను మెకర్స్ ను అందించారు. సినిమా ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించనున్నారు. ఆ ఈవెంట్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: