అందం, అభినయం, నటన ఉన్న హీరోయిన్ లకు మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి,  అయితే అలా నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించకపోయినప్పటికీ ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలను  దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ లలో శ్రీ లీల ఒకరు. హాట్ బ్యూటీ శ్రీ లీల,  శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తన అందంతో,  నటనతో,  మాత్రం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయగలిగింది.  

ఇలా మొదటి సినిమాలో తన అందంతో,  నటనతో,  హవాభావాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హాట్ బ్యూటీ శ్రీ లీల,  సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హాట్ బ్యూటీ  శ్రీ లీల,  రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఇలా సినిమాలతో ఎంతో మంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలో వర్స్  తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది,  ఇది ఇలా ఉంటే శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది,  శ్రీ లీల తాజా పోస్టు లో  మనసు చంచలమైనది...దానిని నియంత్రించడం చాలా కష్టం , కానీ నిరంతరం నేర్చుకోవడం వల్ల మనస్సు ను నియంత్రించుకోవచ్చు,  అంటూ రాసుకొచ్చింది, తాజాగా శ్రీ లీల సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: