రెబల్ స్టార్ ప్రభాస్మరియు సినీ ఇండస్ట్రీలోకి ఈశ్వర్ సినిమా ద్వారా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

కృష్ణంరాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే మంచి స్టార్ ఇమేజ్ ను ఆయన సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమా కథలను ఒప్పుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతూ ఉండడం విశేషం.. ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు బాలకృష్ణ లాంటి హీరోలు సినీ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నా . ఏ రోజు కూడా వీరు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను అయితే తెరకెక్కించలేదు. 

కానీ కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ.. తానేంటో నిరూపించుకుంటూ తెలుగు కీర్తిని.. ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క ప్రభాస్ కి మాత్రమే దక్కింది అని మనం చెప్పవచ్చు. రూ. 20 కోట్ల పారితోషికం అందుకున్న ప్రభాస్ అనుకోకుండా బాహుబలి సినిమా తర్వాత 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాతో ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకున్నట్లూ తెలుస్తుంది. ఇకపోతే స్టార్ హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ తన కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్న ప్రభాస్ ఆయనతో తీస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ ను చవి చూడాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం. ఆయన ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఇప్పుడు చెప్పబోయేది కనుక మీరు వింటే అవును నిజమే కదా అని అనకుండా ఉండరు.ఇదివరకే కృష్ణంరాజు ప్రభాస్ కాంబినేషన్ లో రెబల్ మరియు బిల్లా సినిమాలు వచ్చి ఫ్లాప్ ను చవి చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలో కూడా కృష్ణంరాజు నటించారు. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించడం లేదు . కారణం ఏమిటంటే గీతాంజలి మరియు టైటానిక్ సినిమా లను కలిపి ఈ సినిమా రూపొందించడం జరిగింది అని ఇది కూడా కాపీ కొట్టారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మరి కొంతమంది కృష్ణంరాజు ఆ రెండు సినిమాలలో నటించి ఫ్లాప్ ను చవి చూసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా నటించాడు కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ ను చూస్తోంది.. కానీ ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాకూడదని ప్రభాస్ అభిమానులు అయితే కోరుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: