మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నిజాం లో రూ. 70 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే రూ. 95 కోట్ల వరకు బిజినెస్ పెరిగినట్లు సమాచారం ఇక విషయానికి వస్తే రూ.35 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ రూ.200 కోట్లకు పైగానే ఈ సినిమా అమ్ముడుపోయినట్లు సమాచారం. నిర్మాతలు 350 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించాలని వార్తలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది అంటే ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీసు వద్ద కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో ఆలియా భట్ మొదటిసారి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి రావడం గమనార్హం . ఇక ఈ సినిమా కోసం ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటుంది. ఇక ఇద్దరు హీరోలు కూడా సమానంగా 45 కోట్ల రూపాయల పారితోషకం అందుకోగా .. రాజమౌళి మాత్రం ఈ సినిమా లాభాలలో 30 శాతం వాటా అడిగినట్లు అలాగే రూ.24 కోట్ల రెమ్యూనరేషన్ తో కలిపి ఆయన తీసుకోబోతున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి