సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోను ఊహించుకొని రచయితలు కథ రాయడం చేస్తూ ఉంటారని అందరికి తెలుసు.. ఆ కథ వినిపించిన తర్వాత నచ్చలేదు అని చెప్పడంతో కథలో కొన్ని మార్పులు చేసి మరో హీరోతో తెరకెక్కించడం లాంటివి వారు చేస్తూ ఉంటారు.

అయితే ఇలా ఇప్పటివరకు ఎన్నో సార్లు జరిగింది. కానీ ఒక హీరో రిజెక్ట్ చేసిన తర్వాత మరో హీరో సినిమా చేయడం  అది కూడా ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కావడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. బాబాయ్ బాలయ్య వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఇలాంటిదే విషయమే జరిగిందట.

నట సింహం నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటినుంచి కాదు కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన మాస్ ప్రేక్షకులను ఉద్దేశించి సినిమాలను చేస్తూ ఉంటారు. ఇక అలాంటి బాలకృష్ణను ఊహించుకుని అప్పట్లో స్టార్ రచయితగా కొనసాగుతున్న విజయేంద్రప్రసాద్ ఒక అదిరిపోయే కథ రాశారట.. ఇక ఈ కథను దర్శకుడు బి.గోపాల్ హీరో బాలయ్య కు కూడా వినిపించారు. కానీ అప్పటికే వేరే సినిమా లతో బాగా బిజీగా ఉండడంతో ఇద్దరూ ఈ సినిమాను తిరస్కరించారు. దీంతో ఈ కథ చూసిన రాజమౌళి నేను ఎన్టీఆర్ తో ఈ సినిమా చేస్తాను అంటూ తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు చెప్పాడని తెలుస్తుంది.

కానీ అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ 20 ఏళ్ల వయసులో ఇంత మంచి కథను హేండిల్ చేయలేడు అని విజయేంద్రప్రసాద్ కూడా అన్నాడట. కానీ అప్పటికే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తీసిన రాజమౌళి అతనిపై నమ్మకం ఉంది అంటూ చెప్పడంతో ఇక ఆ సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నాడట. ఆ సినిమా రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చింది. ఆ సినిమా ఏదో కాదు మన అందరికి తెలిసిన సింహాద్రి. ఈ సినిమా ఎంతలా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎనిమిది కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 28 కోట్లు పైగా సాధించింది. ఇక 150 సెంటర్లలో 100 రోజులు 55 సెంటర్లలో 175 రోజులు ఆడి అప్పట్లో భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: