ఇక క్రియేటివిటీ కల్గిన కొంత మంది మీమర్స్ వైన్ షాప్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా జరుగుతుందనే అంశం గురించి వివరించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రం చూసిన వారికి రాజమౌళి ది ఫైర్ ది వాటర్ క్యారెక్టర్ల కలయికను ప్రదర్శించడం ద్వారా సినిమాను ఎలా వివరించారో తెలిసిన విషయమే.ఇక అదే కాన్సెప్ట్ తో ఓ వీడియోను రూపొందించాడు ఓ మీమర్.ముందుగా ఆ వైన్ షాప్ లో ఓ వ్యక్తి ఓ టేబుల్ పై కూర్చుంటాడు. గ్లాసులో మందు పోస్కొని ఇక నీళ్ల బాటిల్ తీస్తాడు. కానీ అప్పటికే అందులోని నీళ్లు అన్ని అయిపోతాయి. చుక్క కూడా వుండవు. అలాగే ఇంకో టేబుల్ పై కూర్చున్న మరో వ్యక్తి కూడా సిగరెట్ తాగాలనుకుంటాడు. దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటాడు. కానీ వెలిగేంచేందుకు ఆతని వద్ద లైటర్ ఉండదు.అయితే అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు గమనించుకొని పలకరించుకుంటారు.ఇక అలా ఒకరి దగ్గర ఉన్న నీళ్లను మరొకరికి ఇచ్చి అతడి వద్దనున్న మంటను అతను తీస్కుంటాడు.



ఇలా ఈ ఫన్నీ వీడియోను పూర్తి చేశాడు మీమర్. అయితే ఈ వీడియో చూసిన వారంతా కూడా కడుపుబ్బా నవ్వుతున్నారు.అయితే ఈ మీమ్ చూసిన వాళ్లంతా ఇది చాలా క్రేజీగా ఉందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే అందర్నీ ఆకట్టుకుంటుండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ వస్తువులను మార్కెట్ లోకి పంపించేటప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లు ఈ లెవెల్లోనో తమ వీడియోలను తయారు చేసేవారు. అయితే ఈ ఫన్నీ మీమ్ కూడా అదే రేంజ్ లో ఉందంటూ నెటిజన్లు వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మీమ్స్ ను తనకు అందించి నవ్వించాలంటూ మీమర్స్ కు చెబుతున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో స్పూఫ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక నెట్టింటా వైరల్ అవుతున్న ఆ వీడియోని మీరు కూడా చూసి నవ్వుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: