ఒకప్పుడైతే ఎక్కువగా యూట్యూబ్ కానీ ఈ మధ్య కాలంలో టిక్ టాక్ లు ఆ తరవాత రీల్స్ వచ్చాక హిట్ సాంగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒకపాట మంచి హైప్ దక్కించుకుంది అంటే చాలు ఇక ఆ పాటకు సాధారణ ప్రజల నుండి సెలెబ్రిటీల వరకు అందరూ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు స్టెప్ లు వేస్తారు. అలా అవి బాగా వైరల్ అవుతాయి. ఇదే తరహాలో ఇపుడు మహేష్ బాబు తాజా చిత్రం "సర్కారు వారి పాట" సినిమా లోని "కళావతి కళావతి..." సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు స్టెప్పులు వేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. అయితే ఇపుడు మరో సెలబ్రిటీ ఈ పాటకు స్టెప్పులు వేయడం తో హైలెట్ అయ్యింది.

తను మరెవరో కాదు సీనియర్ నటి లయ. ఒకప్పుడు కుర్రకారు మదిని కొల్లగొట్టిన ఈ హీరోయిన్ ఇపుడు మరోసారి ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఎందుకంటే ఈమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ అయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు. అయితే ఇప్పుడిప్పుడే అలా కొన్ని రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇపుడు ఈమె వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అచ్చం మహేష్ బాబులా స్టెప్పులు దింపేసారు మేడం అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది మేడం, మేము అంతా కూడా హ్యాపీ అవుతాము అంటూ కోరుకుంటున్నారు.

ఈ ఏజ్ లో కూడా అంతే అందంతో యంగ్ హీరోయిన్ లా అందరినీ తన వైపు ఆకర్షిస్తున్నారు నటి లయ. కాగా సర్కారు వారు పాట మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల అయిన రెండు పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వరకు చూస్తే ఈ సినిమాను మే 12 న విడుదల చేయడానికి చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: