మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 29 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా,  పూజా హెగ్డే ,  రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.  మొదటి సారి తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఫుల్ లెన్త్ లో ఆచార్య  సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఆచార్య సినిమా విడుదలైన అన్ని చోట్ల నుండి మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలా బాక్సాఫీస్ దగ్గర మొదటి షో నుండే మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఆచార్య మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను  సాధించడంలో కూడా కాస్త స్లో అయ్యింది.  అందులో భాగంగా ఆచార్య మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 29.50 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.  ఆచార్య మూవీ రెండవ రోజు 5.15 కోట్ల కలెక్షన్లను సాధించింది.
 
ఆచార్య మూవీ మూడవ రోజు నైజాం ఏరియాలో 1.46 కోట్ల  కలెక్షన్లను సాధించింది. ఆచార్య మూవీ మూడవ రోజు సీడెడ్ లో 64 లక్షలు, యూఎ లో 44 లక్షలు, ఈస్ట్ లో 32 లక్షలు , వెస్ట్ లో 19 లక్షలు , గుంటూర్ 26 లక్షలు , కృష్ణ 51 లక్షలు , నెల్లూర్ లో 25 లక్షల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించండి.  మొత్తంగా మూడవ రోజు ఆచార్య మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.07 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా , 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: