దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రేయ, సముద్ర ఖని  ముఖ్య పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా,  డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటి వరకు దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి సంచలన విజయాన్ని  బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇప్పటికి 50 రోజుల బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  

ఇలా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ జీ 5 లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ  'ఓ టి టి' స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది.  ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 2 వ తేదీ నుండి ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులో ఉండబోతుంది. ఈ విషయాన్ని ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నెట్ ఫిల్స్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: