టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన అడవి శేషు తాజాగా మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ తిక్క ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో జూన్ 3 వ తేదీన విడుదల చేయనున్నారు. మహేష్ బాబు  సొంత బ్యానర్ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీ ని నిర్మించింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో అడవి శేషు సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా శోభితా ధూళిపాళ ఒక కీలకమైన పాత్రలో నటించింది.  మేజర్ సినిమాలో కీలక పాత్రలో నటించిన శోభితా ధూళిపాళ తాజాగా మేజర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

కరోనా సమయంలో చాలా ఆందోళన చేద్దాం. మూవీ 'ఓ టి టి' వెళ్లి పోతుందేమో అని చాలా భయపడ్డం,  కానీ ఆ సమయంలో మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ఇది థియేటర్ లలో విడుదల కావాల్సిన సినిమా... ఎట్టి పరిస్థితుల్లోనూ మేజర్ సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుంది అని చెప్పారు. మహేష్ బాబు మార్గదర్శకం ... ప్రోత్సాహం... మలో చాలా నమ్మకం నింపింది.  చాలా మంచి నిర్మాణ సంస్థలో పని చేశాను అనే ఆనందం ఉంది అని శోభితా ధూళిపాళ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: