‘సర్కారు వారి పాట’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమాకు పోటీ ఇచ్చే మరొక సినిమా లేకపోవడంతో ఈమూవీ కలక్షన్స్ రెండవ వారం కూడ బాగా ఉండటంతో ఈమూవీ బయ్యర్లు చాలావరకు బ్రేక్ ఈవెన్ జోన్ లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం బాగా కష్టపడిన మహేష్ తన భార్య పిల్లలతో కలిసి అమెరికా దగ్గరలోని ఒక ఐలాండ్ కు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.


మహేష్ ఈ షార్ట్ ట్రిప్ ను ముగించుకుని ఈ నెలాఖరున జరగబోయే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాటికి హైదరాబాద్ తిరిగి వస్తాడని తెలుస్తోంది. తన తండ్రి పుట్టినరోజునాడు మహేష్ బాబు తన కొత్త సినిమాలకు సంబంధించిన టీజర్ ను కానీ లేదంటే ఫస్ట్ లుక్ ను కాని విడుదల చేయడం మహేష్ అనుసరిస్తున్న ఒక సెంటిమెంట్. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను అనుసరిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ను కృష్ణ పుట్టినరోజునాడు ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ‘అ’ సెంటిమెంట్ ఎక్కువ ఈ అక్షరం సెంటిమెంట్ తో తీసిన ‘అత్తారింటికి దారేది’ ‘అతడు’ ‘అ ఆ’ ‘అల వైకుంఠ పురములో’ మూవీలు సక్సస్ అయ్యాయి. దీనితో ఆ సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేస్తూ త్రివిక్రమ్ మహేష్ తో తీయబోతున్న మూవీకి ‘అర్జనుడు’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి గతంలో మహేష్ అర్జున్ అన్న మూవీలో నటించాడు. ఆమూవీ కూడ సిష్టర్ సెంటిమెంట్ కథ అయితే ఆమూవీ సక్సస్ కాలేదు.  


ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేసుకోకుండా మహేష్ త్రివిక్రమ్ సెంటిమెంట్ కు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీలో కూడ సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ. మహేష్ కు చెల్లిగా సాయి పల్లవి నటించడం దాదాపు ఖరార్ అయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: