కియారా అద్వానీ.. బాలీవుడ్ బ్యూటీ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మంచి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన  సినిమా లో అందం,  అభినయంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె  తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.  ఇక బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా మంచి ఫామ్లో ఉంది కియారా. ఇక అంతే కాదు పలు తెలుగు,  హిందీ  పాన్ ఇండియా చిత్రాలలో కూడా ఈమె నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈమె నటించిన భూల్ భులయ్య 2 చిత్రం విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడం.. ఇక తన తదుపరి చిత్రం జగ్ జగ్ జియో సినిమా కూడా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె ఈ ట్రైలర్ ని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కీయారా కి  పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవడం జరిగింది.

పెళ్లి చేసుకొని ఎప్పుడు సెటిల్ అవుతారు అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అందుకు కియారా  స్పందిస్తూ నేను పెళ్లి చేసుకోక పోయినప్పటికీ ప్రస్తుతం బాగానే సెటిల్ అయ్యాను..సెటిల్ అవ్వాలి అంటే పెళ్లి  చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది.
 అంతేకాదు ప్రస్తుతం బాగా పని చేయడమే కాదు బాగా సంపాదిస్తున్నాను కూడా అలాగే హ్యాపీగా కూడా ఉన్నాను ఇప్పుడే పెళ్లికి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు అడగవద్దు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: