విక్టరీ, వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలా ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ కారణంగానే దానికి సీక్వెల్ ని కూడా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ 3 చిత్రం నేడు ఘనంగా థియేటర్లలో విడుదల అయ్యింది. f2 బ్లాక్ బస్టర్ రిజల్ట్ కారణంగా ఎఫ్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించిన ఆదరణ అందుకోవడం ఖాయం అంటున్నారు ఇప్పటికే మూవీ చూసిన ప్రేక్షకులు. ఫన్ డబుల్ అయ్యిందని f2 ను మించిన ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి.

పాజిటివ్ టాక్ తో సినిమా అందరినీ తనవైపు ఆకర్షిస్తోంది. ఈ చిత్రం లో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కామెడీ పంచ్ లు ఒకెత్తు అయితే.. మెహ్రీన్, తమన్నా, సోనాల్ చౌహన్ లాంటి అందగత్తెల గ్లామర్ మరో ఎత్తు.   సూపర్ పాజిటివ్ బజ్ తో ఎఫ్3 థియేటర్స్ లో కోలాహలం చేస్తుండగా, ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ తో బిజినెస్ కూడా అదే స్తాయిలో భారీగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి ఓ టి టి రైట్స్ కొనుగోలు జరిగిపోయిందని సమాచారం. లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంతే... ఎఫ్3 ఓటిటి డీల్ కుదుర్చుకుని సోనీ లివ్ సంస్థ రైట్స్ దక్కించుకుందట. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ నిజమే అని తెలుస్తోంది.

సినిమా కోసం అమెజాన్ తో పీటర్ పడి అమ్రి ఏకంగా 18 కోట్లు పోసి ఈ సినిమా ఓ టి టి రైట్స్ ను దక్కించుకుందట సోనీ లివ్ సంస్థ. మరి ఈ వార్తకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం అయితే  థియేటర్లలో ఎఫ్ 3 సందడి మామూలుగా లేదుగా అంతేగా అంతేగా అంటూ జనం ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: