లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ , తెలుగు , కన్నడ ,మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున గ్రాండ్ గా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే అనేక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో, సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున  విక్రమ్ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలలో ఒకరు ఆయన విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేయాబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఏ ఏరియా లో బుకింగ్స్ ఓపెన్ అయిన అక్కడ మంచి ఆశాజనకమైన బుకింగ్ లు అవుతున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈ సినిమాకు ఓవర్సీస్ లో మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా విక్రమ్ సినిమాకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ కనబడడానికి ప్రధానకారణం...  విశ్వరూపం సినిమా తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా కావడం... మానగరం , ఖైదీ , మాస్టర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం... విజయ్ సేతుపతి... ఫాహాద్ ఫాజిల్... సూర్య వంటి గొప్ప గొప్ప నటులు ఈ సినిమాలో నటించడం...  ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఓవర్సీస్ లో వస్తోంది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: