సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సర్కారు వారి పాట థియేటర్ లో సందడి చేస్తుంది. మే 12న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 3వ వారం లోకి అడుగు పెట్టింది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం 3 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. మురారి వా సాంగ్ ఒకటి కంపోజ్ చేసినా దాని బదులుగా మ మ మహేష్ అనే మాస్ సాంగ్ ఒకటి పెట్టారు.

ఇక 3 వ వారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సినిమాలో మురారి వా సాంగ్ యాడ్ చేశారు. అయితే ఆల్రెడీ ఇప్పటికే సినిమా చాలా చోట్ల తీసేశారు. మరి ఈ టైం లో ఈ మురారి వా సాంగ్ యాడ్ చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. అయితే మురారి వా సాంగ్ డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ని సంబందించిన ప్రోమో రిలీజ్ చేయలేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మురారి వా సాంగ్ ప్రోమో కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అయితే కొందరు మహేష్ సూపర్ ఫ్యాన్స్ మాత్రం మురారి వా సాంగ్ కోసం మళ్లీ సినిమా చూసి ఆ సాంగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. మురారి వా సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తే ఈ థియేటర్ వీడియో క్లిప్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉండదు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా అమేజాన్ ప్రైం లో రిలీజ్ చేశారు. సర్కారు వారి పాట సినిమాను రెంటల్ బేస్ మీద అమేజాన్ ప్రైం లో రిలీజ్ చేశారు. 199 రూపాయలతో అమేజాన్ ప్రైం లో సర్కారు వారి పాట సినిమా చూడొచ్చు. సూపర్ స్టార్ మహేష్ మురారి వా సాంగ్ లో కీర్తి సురేష్ మాత్రం రెచ్చిపోయిందని అర్ధమవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: