కియారా అద్వానీ.. ఒకవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడంతో పాటు మరోవైపు గ్లామర్ పాత్రల్లో కూడా మెరుస్తూ ప్రేక్షకులందరిని కూడా తన మాయలో ముంచేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ సొగసరి. బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పటికే బాలీవుడ్ లో మరో వైపు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. కియారా అద్వాని తమిళంలో ఒక సినిమా చేయబోతుందా అంటే ప్రస్తుతం అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇటీవలి కాలంలో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు యువ హీరో శివ కార్తికేయన్. ఇక ఈ హీరోసినిమా చేసినా అది మంచి విజయాన్ని సాధిస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతుంది. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్ హీరోగా మాడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.


 ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీ సంప్రదించాడట దర్శకుడు. కథ వినిపించగా కియారా అద్వాని కి కథ నచ్చినట్లు తెలుస్తుంది. దీంతో శివ కార్తికేయ సినిమాలో నటించి ఇక కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట ఈ ముద్దుగుమ్మ. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. గతంలోనే చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది కియారా అద్వాని.. మరి కోలీవుడ్లో ఈ అమ్మడు ఎలా హవా నడిపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: